ముస్లిం సోద‌రుల‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రంజాన్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపుతూ ఓ సందేశాన్ని విడుద‌ల చేశారు.. మాన‌వాళికి స‌ద్భుద్దిని ప్ర‌సాధించ‌డానికి దివ్వ ఖురాన్ అవ‌త‌రించిన మాసంగా రంజాన్ నెల‌ను ఆయ‌న ప్ర‌స్థుతించారు.. అలాంటి ప‌త్యేక‌త ఉంది కాబ‌ట్టే., ఈ మాసానికి అంత‌టి ప‌విత్ర‌త వ‌చ్చింద‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. ఖురాన్ ప్ర‌వ‌చించిన శాంతి, స‌హ‌నం, ద‌య‌, సేవాత‌త్ప‌ర‌త‌, దాన‌గుణాలు స‌ర్వ‌దా ఆచ‌ర‌ణీయ‌మ‌ని తెలిపారు.. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రూ ఖురాన్‌ని అనుస‌రిస్తే., ఆచ‌రిస్తే., సుఖ‌సంతోషాలు ప‌రిడ‌విల్లుతాయ‌ని జ‌న‌సేనుడు అన్నారు.. త‌ద్వారా స‌మ‌స‌మాజం ఆవిర్భ‌విస్తుంద‌న్నారు..

ఖురాన్ ఏదైతే ప్ర‌వ‌చించిందో., అటువంటి మేలైన స‌మాజ స్థాప‌నే జ‌న‌సేన కాంక్ష‌., ఆకాంక్ష అని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు.. ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోద‌రుల‌కి, ప్ర‌పంచంలోని ముస్లిం స‌మాజానికి త‌న త‌రుపున‌, జ‌న‌సేన పార్టీ శ్రేణుల త‌రుపున సోద‌ర పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపిన‌ట్టు త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. ఈద్ ముబార‌క్ హో అంటూ ప్ర‌క‌ట‌న పాఠాన్ని జ‌న‌సేనుడు ముగించారు..

జ‌న‌సేనుడి ఆకాంక్ష ఏదైతే ఉందో., సేవ‌, దాన‌గుణం., వీటిని అణువ‌ణువూ వంట‌ప‌ట్టించుకున్న జ‌న‌సైనికులు రంజాన్ మాసం మొత్తం ముస్లిం సోద‌రుల సేవ‌లో త‌రించారు.. చాలా ప్రాంతాల్లో ఇఫ్త‌ర్ వింధులు ఏర్పాటు చేసి., ఉప‌వాస దీక్ష‌లో ఉన్న‌వారి ఆశీస్సులు పొందారు..

 

originally published on PawanToday.com

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments