Sardaar-Gabbar-Singh-Photos-09

అప్పట్లో మనకు చిరంజీవి తప్ప ఇంకొకరు తెలీదు.

1997 లో అనుకుంటా..పక్కింట్లో రమేష్ గాడు ఆళ్ళ డాడీతో చిరు సినిమా మాస్టర్ కి వేల్లాడంట.

నేను మా నాన్నగారిని పట్టుబట్టా సినిమాకి తీస్కేల్లమని.  తీరా ధియేటర్ కి వెళ్లేసరికి ఫుల్ క్రౌడ్. టికెట్ దొరికే పరిస్తితి లేదు. అక్కడ మాలాగే టికెట్ దొరక్కపోవడంవల్ల వెనుదిరుగుతూ , పక్క ధియేటర్ లో అదేదో సినిమా అంట అదయినా చూద్దాం అని అనుకుంటున్నారు. వెంటనే నాన్నని అడిగా వాళ్ళు వెళ్ళే సినిమాకి వెళ్దాం అని. నాన్న పక్కనేవర్నో అడిగారు ఎం సినిమా బాబు పక్క ధియేటర్ లో అని….. నాకింకా గుర్తు , ఆయన సినిమా పేరు గాని హీరో పెరుగాని చెప్పలేదు. కాని ఒకే మాట అన్నాడు . “చిరంజీవి తమ్ముడి సినిమా అంట ” అని.

ఎదో ఆ రమేష్ గాడి ముందు పోజు కొట్టడానికి సినిమా చూసాగాని అర్ధం చేస్కునేంత జ్ఞానం రాలేదు నాకు కాని వాడికి కాని. :డ

తర్వాతరోజు వాడికి చెప్పా మేము సినిమా చూసాం అని. పేరు అడిగాడు …మనకు తెలీదు కదా చిరంజీవి తమ్ముడి సినిమా”” అన్నాను . పేరు అది కాదు అన్నాడు. మళ్ళి డాడీ దగ్గరికెళ్ళి అడిగితే “గోకులంలో సీత ”.. అని చెప్పాడు.

ఈ సినిమా అనగానే నాకు ఇప్పటికి గుర్తోచ్చె సీన్

“హీరోకి క్లైమాక్స్ లో బాడీకి నిప్పు అంటుకుంటే అక్కడ వాళ్ళు ఆర్పే సీన్.”

అప్పటికి కూడా మనకి హీరో పేరు తెల్వదు :P

ఒకరోజు సిటి కేబుల్ లో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా వస్తుంది …అప్పుడు టైటిల్స్ లో చూసా

అపుడే మైండ్ లో గట్టిగ ప్రింట్ అయిన సీన్

“పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గా చేసిన సాహస కృత్యాలు”

ఆ ఏజ్ లో సినిమాకి వెళ్ళాలంటే డాడీ ని తీస్కేల్లాలి , అందువల్ల ఈ మద్యలో ఎం సినిమాలు చూళ్ళేదు. తొలిప్రేమ సినిమా చూసే అవకాశం వచినా నాన్న గారికి టైం కుదరకపోవడం వల్ల ప్రోగ్రాం కాన్సిల్ అయింది.

ఇంకోసారి అక్కవాళ్ళు నాకు చెప్పకుండా అన్నయ్యను మాత్రమె తీస్కేల్లారు ఆ సినిమాకి…అప్పుడు దానికి మనం అలిగి నిరసనగా అన్నం తినకపోవడం జరిగింది. కాని మనల్ని వాళ్ళు లైట్ తీస్కోవడం వాళ్ళ … అన్నం తినేసి ఆడుకోడానికి వెళ్ళాను…..:

అలా నేను అన్నానికి ఆటకి ఆశపడి వెండితెరపై “తొలి ప్రేమ” ని మిస్ అయ్యానని , అదికూడా ఊహ తెలిసాక అర్దమయింది …:D

తర్వాతా గుర్తుంది “తమ్ముడు” సినిమా . టీవిలోనే చూసా. కిక్ బాక్సింగ్ , ట్రావెలింగ్ సోల్జర్ అనేసరికి ప్రబావం చూపి , కొన్ని రోజులకి స్కూల్ లో కరాటే క్లాసెస్ కి పెరిమ్మంటే ఇచ్చేసా. పవన్ కళ్యాణ్ వల్లనే అల నేర్చుకుని కుండలు, బండలు పగలగొట్టి హీరో అయిపోదామని అనిపించింది. అయితే మా కరాటే మాస్టార్ వేదింపులు తట్టుకోలేక, ఒక పదిరోజులకే మానేశాము ..అది వేరే విషయం అనుకోండి హహహ ….:))

ప్లే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకుంటా , ఫ్రెండ్స్ అంతా “కుషి ” సినిమా టికెట్ దొరకలేదు బ్లాక్ లో అంతకు కొన్నాం ఇంతకూ కొన్నాం అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఈ పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగిపోతుందని అర్ధమయ్యింది. అప్పుడు ఇంకా గొప్పగా ఊహించుకోడం మొదలుపెట్టా .

మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యూత్ అంతా “జానీ” హెడ్ బాండ్ అని ఇంకా కొందరు కాలికి కట్టుకోదాలు ఆయన్ని ఇమిటేట్ చెయ్యడాలు చూసి పిచ్చెక్కిపోయింది. ఇంతలా మార్చేసాదేన్త్రా యూత్ ని అనుకున్నా.

కొన్ని కారణాల వాళ్ళ చాలా సినిమాలకి రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడాలు, తగ్గించుకోవడాలు విని ఆయన మీద గౌరవం పెరిగింది.ఇప్పటికి కూడా ఆయనలో మార్పు రాలేదు ఈ విషయంలో.

పి.ఆర్.పి  క్యాంపెయిన్ అప్పుడు పవన్ కళ్యాణ్ ని మొదటిసారి చూడటం , ….అపుడే పేపర్లు , న్యూస్ చూడటం మొదలెట్టిన నాకు ఆయన స్పీచ్ లు గుండెల్లో గుచ్చుకునేవి.

“జల్సా” ఇంటర్వెల్ లో సంజయ్ సాహు కంటే నాకు పవన్ కళ్యాణే కనిపించాడు. “బాలు ” సినిమాలో నాకు గని కాదు నాకు పవన్ కళ్యాణే కనిపించాడు.

కొమరం పులి విడుదలయిన రెండో రోజు (టాక్ అప్పటికే తెలుసు) కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్ సీన్ కి , స్టేషన్లో అమ్మాయి ఇచిన కంప్లయింట్ తీస్కోని పోలీస్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ ఆ ఇంటెన్సిటీ నిజంగా నాకు చాల కనెక్ట్ అయింది.

యాసిడ్ దాడిలో చనిపోయిన ఆడబిద్దని తలుచుకుని బాదపడ్డ ఉద్విగ్న సందర్భం , గన్ హ్యాండ్ఓవర్  చేసి కోటి రూపాయలకు చెక్ రాసిన పవన్ కళ్యాణ్ , “పంజా ” ఆడియో ఫంక్షన్ లో  ఆయనకోసం అక్కడ వెలసిన అభిమాన సముద్రం ఇవన్ని గుర్తుకొస్తూనే ఉంటాయ్.

సక్సెస్ కి పొంగిపోని గుణం, డబ్బుకి లోన్గిపోని నైజం , ఎవరికీ భయపడని ధైర్యం , తోటి ఆర్టిస్ట్ అంటే గౌరవం, మాట తప్పని తెగువ, …ఇవన్ని నన్నే కాదు లక్షలమందిని తన రీల్ అండ్ రియల్ హీరోయిజం తో ఫాన్స్ ని చేస్కున్నాడని నమ్ముతున్నా

నాటి “చిరు పద్మభూషణ్ ఫంక్షన్” స్పీచ్ నుండి నేటి “రేయ్ ఆడియో ఫంక్షన్ స్పీచ్” వరకు..

బాలు” నుండి ” గౌతమ్ నందా” వరకు …..

చిరు తమ్ముడు” నుండి “చిరు తర్వాత ఈ తమ్ముడే” దాకా

పవన్ కళ్యాణ్ ” నుండి  “పవర్ స్టార్” దాకా  “పవర్ స్టార్ ” నుండి “పవనిజం” దాకా ఆయన యూనిక్ అంతే…

సింపుల్ గా చెప్పాలంటే ఈ మూడు ముక్కల్లో

యాక్షన్ అనగానే వచ్చి , కట్ అనగానే వెళ్ళిపోయే హీరోయిజం కాదు ఆయనది

నాకు పవన్ కళ్యాణ్ ని చూస్తె ఒకటే అనిపిస్తుంది…. స్టార్ …

పవన్ కళ్యాణ్ ని చూసి కష్టపడం అంటే ఏంటో నేర్చుకున్నా

జై హింద్ .

Ranjith (Randy)

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments