ఓ అడుగు వేస్తున్నామంటే.. ఆ అడుగు వేసే చోటు ఎలా ఉంది.. త‌డిగా ఉందా.. పొడిగా ఉందా.. ఆ ప్లేస్ మంచిదా.. కాదా..? అక్క‌డ ప్ర‌మాదం ఏదైనా పొంచి ఉందా..? ఇన్ని ఆలోచిస్తామ‌న్న సంగ‌తి మ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోంగానీ.. క‌ళ్ల సాయంతో మెద‌డు పై ప‌నుల‌న్నీ చేసేస్తుంది.. మ‌రి ఒక్క అడుగు వేయ‌డానికే ఇంత ఆలోచిస్తే.. మ‌నం రాజ్యాంగ బ‌ద్దంగా., మ‌న‌పై అధికారాన్ని ఐదేళ్ల పాటు ఓ పార్టీకి క‌ట్ట‌బెడుతున్నామంటే ఇంకా ఎంత ఆలోచించాలి.. ఇందుకు మాత్రం ఒక్క క్ష‌ణం కూడా స‌మ‌యం తీసుకోం.. అందుకే అడుగ‌డుగునా మ‌న‌కి ఇన్ని స‌మ‌స్య‌లు.. ఇక్క‌డ అవ‌కాశాలు లేక., ఉన్నా రాక‌., సంపాద‌న కోసం దేశం దాటి వెళ్లిన ఎన్ఆర్ఐలు మాత్రం అలా ఆలోచించ‌డం లేదు.. మాతృభూమి ఈ దుస్థితికి కార‌ణం ఎవ‌రు..? వారిని నిలువ‌రించ‌డం ఎలా..? ఇలాంటి పాల‌కుల భారి నుంచి దేశాన్ని ఆదుకునే నాధుడు ఎవ‌రు అని అన్వేషిస్తున్నారు.. అన్వేషిస్తూనే ఉన్నారు.. ఆ మార్పు తీసుకురాగ‌లిగిన నాయ‌కుడికి త‌మ వంతు అన్ని ర‌కాలుగా అండ‌గా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు..
ప్ర‌స్తుతం.. న‌ల్ల‌దొర‌ల పాల‌న‌లో నానా అవ‌స్థ‌లు ప‌డుతున్న జ‌నాన్ని., ఆ చీక‌ట్ల నుంచి బ‌య‌ట‌కు తీసుకురాగ‌లిగే కాంతిపుంజం ఒక‌టి వారికి క‌న‌బ‌డుతోంది.. అదే జ‌న‌సేన‌., ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. రాజ‌కీయాల్లో ఓ మార్పు కోసం.. రాజ‌కీయాల‌కు ప‌ర‌మార్ధం ప్ర‌జాసేవ అన్న సిద్ధాంతంతో.. నిబ‌ద్ద‌త‌తో కూడిన‌.. నిజాయితీతో కూడిన రాజ‌కీయాలు చేద్దాం రండి.. అంటూ ఆయ‌న ఇచ్చిన పిలుపు వేలాది మంది ఎన్ఆర్ఐల‌ను క‌దిలించింది.. ముఖ్యంగా ఆయ‌న నేర్పిన స్వ‌చ్చ‌మైన సేవాగుణం., వారిలో స్ఫూర్తిని ర‌గిల్చింది.. సేవాకాంక్ష‌ను రేపింది.. ఇప్ప‌టికే స్వ‌దేశంలో ఆర్ధిక వ‌న‌రులు లేక వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అభాగ్యుల‌కి ఆస‌రాగా నిలిచేలా చేసింది..
వీరికి ఇది సంతృప్తినివ్వ‌లేదు.. ఇలాంటి అభాగ్యుల‌ని ఆదుకునేందుకు., సామాన్యుడికి సేవ చేసేందుకు ఓ శాశ్విత ప‌రిష్కారం చూడాల‌న్న కోరిక క‌లిగింది.. అది ఎలా సాధ్యం.. రాజ‌కీయాల్లో మార్పురావాలి.. రాజ‌కీయాల్లో ఓ న‌వ‌శ‌కాన్ని నిర్మించాలి.. అప్పుడే ఆ శాశ్విత ప‌రిష్కారం సాధ్య‌మ‌వుతుంది.. ఇదే అజెండాతో జ‌న‌సేన ఎన్ఆర్ఐ వింగ్ ఏర్ప‌డింది.. ప్ర‌తి దేశంలో ఉన్న ఎన్ఆర్ఐలు.. జ‌న‌సేనుడికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న ఎన్ఆర్ఐలు ఓ టీంగా ఏర్ప‌డి., జ‌న‌సేన కోసం త‌మ‌వంతు చేయ‌గ‌లిగింది చేస్తున్నారు.. తాజాగా టీం జ‌న‌సేన సింగ‌పూర్ విభాగం తొలి స‌మావేశాన్ని నిర్వ‌హించేందుకు రెడీ అవుతోంది.. ఈ నెల 23న ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది..
తొలి స‌మావేశం.. అక్క‌డికి వ‌చ్చే వారంతా ఎన్ఆర్ఐలు.. వీరు ఏం మాట్లాడుకుంటారు..? అనుకుంటే పొర‌పాటే.. వీరి వ‌ద్ద స‌మావేశానికి సంబంధించి ప‌క్కా ప్ర‌ణాళిక ఉంది.. రెండే అంశాలు అక్క‌డ అజెండాలో ఉన్నాయి.. ఈ రెండూ కూడా ఎంత స్ట్రాంగ్ అంటే.. ఫ‌స్ట్ పాయింట్‌.. జ‌న‌సేన‌కు అస‌లు నేనెందుకు స‌పోర్ట్ చేస్తున్నాను.. ఓ పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నాం అంటే.. ఖ‌చ్చితంగా దాని వెనుక బ‌ల‌మైన కార‌ణాలు ఉండాలి.. ఆ కార‌ణాలు ఏంటి..? న‌ంబ‌ర్ టూ.. నేను జ‌న‌సేన‌ను ఇష్ట‌ప‌డుతున్నాను కాబ‌ట్టి., పార్టీ గెలుపు కోసం ఏ విధంగా స‌హాయ‌ప‌డ‌గ‌ల‌ను.. స్వ‌దేశంలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌ణ కోసం., స‌మ‌స్య‌ల్లో మ‌గ్గుతున్న జ‌నం కోసం ఎన్ఆర్ఐలు ఇంత‌గా ఆలోచిస్తున్నారా..? అని ఆశ్చ‌ర్య‌పోయినా., జ‌న‌సైనికుల ఆలోచ‌న మాత్రం నిత్యం ఏదేశ‌మేగినా పొగ‌డ‌రా నీత‌ల్లి భూమి భార‌తిని., నిలుపరా నీ జాతి నిండు గౌర‌వ‌ము అన్న చందంగానే ఉంటుంది.. ఎందుకంటే జ‌న‌సేనుడి ప్ర‌తి మొద‌టి., చివ‌రి అడుగులు జై హింద్ అన్న నినాదంతోనే ముగుస్తుంది కాబ‌ట్టి.. అదే వారికి స్ఫూర్తి..
ఇక సింగ‌పూర్ జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. సురేష్‌, మోహ‌న్‌, కుమార్, రాజా, శీను, స‌తీష్‌, సూర్య‌ప్ర‌కాష్‌, ర‌వి, కృష్ణ మోహ‌న్‌ల‌తో కూడిన కోర్ టీం ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నుంది.. సివిల్ స‌ర్వీసెస్ క్ల‌బ్‌, తెసెంసోహాన్ రోడ్‌లో ఈ నెల 23న జ‌రిగే ఈ స‌మావేశానికి స్థానికంగా ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు భార‌గా హాజ‌రుకానున్నారు..
source pawantoday.com

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments