జై కిసాజ్‌.. జై జ‌వాన్‌.. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చే సిద్ధాంతాలు ఇవి.. బోర్డ‌ర్‌లో సైనికుడు., దేశంలో రైతు సుభిక్షంగా ఉంటే., దేశం మొత్తం సుఖ‌శాంతుల‌తో వ‌ర్ధిల్లుతుందంటారు జ‌న‌సేనాని.. అందుకే రైతులు ఎలాంటి స‌మ‌స్య‌ను త‌న చెంత‌కు తీసుకువ‌చ్చినా., యుద్ధ‌ప్రాతిప‌దికన స్పందించేస్తారు.. స్పాట్‌లో ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నం చేస్తారు.. జ‌న‌సేనాని స్ఫూర్తితో ఆయ‌న సైన్యం కూడా ఇప్పుడు అన్న‌దాత రుణం తీర్చుకుందాం అంటూ ఓ కార్య‌క్రమానికి రూప‌క‌ల్ప‌న చేసింది.. ఇటీవ‌ల ఏరువాక పున్న‌మి హ‌డావిడి చేస్తున్న పార్టీలు., ఆ త‌ర్వాత రైతుకి ఏ క‌ష్టం వ‌చ్చినా క‌న‌బ‌డ‌వు.. చింతా రాజ‌శేఖ‌ర్ అనే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌., ఏదో నాలుగు ఫోటోలకు ఫోజులివ్వ‌డం అనే ప‌ద్ద‌తిని ప‌క్క‌న‌పెట్టి.. అన్న‌తాద ఆత్మీయ క‌ల‌యిక పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు.. పొలంలో దుక్కిలు మొద‌లు పెట్టేనాటి నుంచి నారుమ‌ళ్లు., నాట్లు ఇలా ప్ర‌తి స్టేజ్‌లో రైతు భాగోగులు తెలుసుకోవ‌డ‌మే ఆ కార్య‌క్ర‌మం ఉద్దేశం..

అన్న‌దాతా సుఖీభ‌వ అనే ఈ కాన్సెప్ట్‌ని కృష్ణాజిల్లాలో ముందుగా ఆచ‌ర‌ణ‌లో పెట్టారు జ‌న‌సైనికులు.. ర‌వికుమార్‌, య‌తేంద్ర‌, రంగ‌నాథ్‌, మూర్తి, తుంగ‌ల హ‌రిప్ర‌సాద్‌, రాయ‌పూడి వేణు, హ‌రి బండ్రెడ్డి, గుడివాడ రామ‌కృష్ణ.. ఇలా అన్ని ప్రాంతాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు క‌ల‌సి ఓ మాట అనుకుని., పొలంబాట ప‌ట్టారు.. అవ‌నిగ‌డ్డ నుంచి మొద‌లుపెట్టి నందిగామ వ‌ర‌కు పొలాల వెంట క‌లియదిరుగుతూ., అక్క‌డ పొలం ప‌నుల్లో ఉన్న అన్న‌దాత‌ని ప‌లుక‌రిస్తూ ముందుకి సాగారు.. ఈ ఏడాది మీకు పంట‌లు భాగా పండాలి కోరుతూ., శ్రామిక చిహ్న‌మైన ఎర్ర‌తుండును రైత‌న్న మెడ‌కు అలంక‌రించి స‌ర్క‌రించారు.. ట్రాక్ట‌ర్‌తో భూమిపొర‌ల్ని పెక‌లిస్తూ., దుక్కితో పంట‌కు సిద్ధం చేస్తున్న డ్రైవ‌ర్ ద‌గ్గ‌ర నుంచి పొలంలో చిన్న చిన్న ప‌నులు చేసుకుంటున్న కూలీల వ‌ర‌కు అంద‌ర్నీ జ‌న‌సైన్యం అక్కున చేర్చుకుంది.. మీరు లేకుంటే ఈ దేశం మ‌నుగ‌డే లేదన్న విష‌యాన్ని గుర్తు చేస్తూ., ఈ ఏడాది వాతావ‌ర‌ణం క‌ల‌సి వ‌చ్చి పంట‌లు స‌మృద్దిగా పండాలంటూ నేల త‌ల్లిని ప్రార్ధించారు..

ఇప్పుడిప్పుడే వ్య‌వ‌సాయం ప‌నులు మొద‌లు పెడుతున్న అన్న‌దాత‌., త‌న‌ను ప‌లుక‌రించే వారు కూడా ఉన్నారా..? అంటూ ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు.. అయితే వ‌చ్చింది జ‌న‌సైన్యం అని తెలిసి సంతోషించాడు.. గుడివాడ ప‌రిస‌రాల్లో జ‌రిగిన ఈ అన్న‌దాతా సుఖీభ‌వ కార్య‌క్ర‌మంలో అయితే జ‌న‌సైనికులు ఏకంగా రైతుల‌కి కాసేపు పొలం ప‌నుల్లో సాయం కూడా చేశారు..

నీరు పెట్ట‌డం, నారు మ‌ళ్లు వేయ‌డం, నాట్లు వేయ‌డం ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి స్టేజ్‌లో అన్న‌దాత‌ని ప‌లుక‌రించి., భాగోగులు తెలుసుకోవాల‌ని జ‌న‌సైనికులు నిర్ణ‌యించారు.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటే., అన్నం పెట్టే అన్న‌దాత రుణం తీర్చుకునే క్ర‌మంలో నిత్యం వారికి అందుబాటులో., అండ‌గా ఉంటామ‌ని భూమిత‌ల్లి సాక్షిగా ప్ర‌మాణం చేశారు.. ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్కారానికి ఎవ‌రితో అయినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోరుతూ చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం ఆచ‌ర‌ణీయం..

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments