న‌లుగురు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఒక చోట క‌లిస్తే., ఇప్పుడు వారి మ‌ధ్య వ‌చ్చే టాపిక్ ఒక‌టే., జ‌నానికి ఏం చేద్దాం.. జేబులో ఉన్న‌దానితో ఎవ‌రికి సేవ చేద్దాం.. ఎవ‌రి స‌మ‌స్య‌లు తీరుద్దాం.. జ‌న‌సేనుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తిని మ‌నం మ‌రో ప‌ది మందికి పంచ‌డం ఎలా..? తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ ఏ ఇద్ద‌రు జ‌న‌సైనికులు క‌ల‌సినా., ఇలాంటి చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి.. జ‌న‌సేనాని వారిలో నింపిన సేవా దృక్ప‌దం అలాంటిది మ‌రి.. ఏదో న‌లుగురికి భోజ‌నం పెట్టి చేతులు దులుపుకున్నామా..? లేక త‌లో బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి చంక‌లు గుద్దుకున్నామా..? అన్న‌ట్టు లేదు ఇప్పుడు జ‌న‌సైనికులు ఆలోచ‌న‌.. చేసే సేవ‌లో కూడా వైవిద్యాన్ని వెతుక్కుంటున్నారు.. అది అందుకున్న వారికి జీవితాంతం ఉప‌యోగ‌ప‌డేలా ఆలోచ‌న చేస్తున్నారు.. అది అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కం కావాల‌ని కూడా భావిస్తున్నారు.. తాడేప‌ల్లిగూడెంలో క‌ల‌సిన ఓ ఐదుగురు జ‌న‌సైనికులు., మిత్రబంధం ఏర్ప‌డిన త‌ర్వాత చేసిన ఓ సామాజిక సేవా కార్య‌క్ర‌మ‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌..

ప‌రిచ‌యంలో అంద‌రిదీ ఒకే ఊర‌ని తెలుసుకున్న గ‌ర‌గ బాలాజీ, మైలవ‌ర‌పు రాజా., నిమ్మ‌ల స‌త్య‌నారాయ‌ణ‌, న‌వీన్‌, వంశీ అరిశెట్టి.. సొంత ఊరు ఉప్పాక‌పాడుకి ఏదో ఒక‌టి చేయాల‌నుకున్నారు.. అదీ త‌మ ఆరాధ్య నాయ‌కుడు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన పేరుతో.. త‌ద్వారా సొంత ఊరికి ఏదో ఒక‌టి చేయాల‌న్న కాంక్ష‌ను తోటి జన‌సైనికుల్లో నింపాల‌ని భావించారు.. చేసే సాయం జీవిత‌కాలం ఉప‌యోగ‌ప‌డాలి.. అదీ పేద‌ల‌కి కోసం చేయాలి అని ఆలోచించిన జ‌న‌సైన్యం., నిరు పేద రైతులు, రెక్కాడితే గాని డొక్కాడ‌ని రోజు కూలీల‌ను త‌మ సేవ‌కు మార్గంగా ఎంచుకున్నారు.. ఊరు మొత్తంలో ఎవ‌రైతే పూట గ‌డ‌వ‌ని దుస్థితిలో ఉన్నారో., వారంద‌ర్నీ పోగేశారు.. ముందుగా అంద‌రికీ ఓటు విలువ., ఇత‌ర దేశాల్లో ప‌రిస్థితుల‌పై చైత‌న్యం తీసుకువ‌చ్చే అంశాలు వివ‌రించారు..

ఇక అస‌లు మేట‌ర్‌కి వ‌స్తే.. ఓ 50 మంది పేద రైతులు, కౌలు రైతులు, రోజు కూలీల‌ను ఎంచుకుని వారంద‌రికీ ఇన్సెరెన్స్ చేయించారు.. జీవిత‌కాలం ప్ర‌మాదభీమా వ‌ర్తించే ఏర్పాటు చేశారు.. ఎలాంటి సంద‌ర్బంలో అయినా వీరికి ఏదైనా ప్ర‌మాదం వాటిల్లితే., వాటి కుటుంబాలు మ‌రింత దుర్భ‌ర ప‌రిస్థితుల్లోకి నెట్ట‌బ‌డ‌టాన్ని గ‌మ‌నించిన ఈ ఐదుగురు జ‌న‌సైనికులు., త‌మ సేవ వారికి జీవితాంత ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉండాల‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.. ఊరు మ‌న‌కి చాలా ఇచ్చింది.. మ‌నం కూడా ఎంతో కొంత తిరిగి ఇచ్చేద్దాం అంటూ వీరు చేసిన ప్ర‌య‌త్నం స్ఫూర్తిదాయకం.. ఇలాంటి ఆలోచ‌న ఉన్న‌వారెవ‌రైనా సొంత ఊరికి సేవ చేసేందుకు ముందుకి వ‌చ్చినా., త‌మ వంతు స‌హ‌కారం అందించేందుకు జ‌న‌సైన్యం సిద్ధంగా ఉంది.. ఉంటుంది..

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments