నేటికీ నాగ‌రిక చాయ‌లు తెలియ‌ని గిరిపుత్రులు., క‌ల్లాక‌ప‌టం తెలియ‌ని స్వ‌చ్చ‌మైన అడ‌వి బిడ్డ‌లు.. ఆకులూ,అల‌ములు తిని బ‌తికేస్తారు.. ఎవ‌రికీ భారం కారు., ఎవ‌ర్నీ భారంగా భావించ‌రు.. కానీ వానాకాలం మొద‌లు కావ‌డంతోనే వారికి జీవితాలే భారంగా మార‌తాయి.. వ‌ర్షాలు మొసుకొచ్చే నీటి కాలుష్యం., విష‌పు పురుగులు, దోమ‌లు ఒక్క‌సారిగా ఈ అడ‌వి బిడ్డ‌ల‌పై దాడి చేస్తాయి.. అంతుబ‌ట్ట‌ని రోగాల భారిన ప‌డేస్తాయి.. ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కూడా తీసేస్తాయి.. ఇలాంటి దుర్భ‌ర‌ ప‌రిస్థితులు ఏజెన్సీకి కొత్త కాదు.. ఏటా అంతుబ‌ట్ట‌ని రోగాలు వీరిపై దాడి చేస్తూనే ఉంటాయి… వాన‌లు మొద‌లు కాగానే మ‌న్యంలో ఎప్ప‌టిలాగే ప్రాణాలు తోడేసే విష‌జ్వ‌రాలు గిరిజ‌నంపై దాడి చేశాయి.. రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్‌లో ప‌దుల సంఖ్య‌లో జ‌నం ప్రాణాలు తీసేశాయి.. అయితే ఓట్లు వేయించుకునేప్పుడు ఉన్నంత శ్ర‌ద్ద జ‌నం ప్రాణాలు కాపాడే విష‌యంలో నాయ‌కులు చూప‌లేదు.. దీంతో ఆ అడ‌విబిడ్డ‌ల బాధ‌లు బ‌య‌టి ప్ర‌పంచానికి చూపే బాధ్య‌త‌ని జ‌న‌సైన్యం భుజాన వేసుకుంది.. విష‌యాన్ని మీడియాకి చేర‌వేసింది..

విష‌యం తెలుసుకున్న స‌ర్కారు స్పందించింది.. అర‌కొర ఏర్పాట్ల‌తో మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది.. అయితే జ‌నసేన కార్య‌క‌ర్త‌లు మాత్రం అంత‌టితో వ‌దిలేయ‌లేదు.. రాజ‌మండ్రిలోని సాటి కార్య‌క‌ర్త‌ల‌కి మ‌న్యం ప్ర‌జ‌ల వెత‌లు చేర‌వేశారు.. జ‌న‌సేవ ఫౌండ‌ర్‌, జ‌న‌సేన కార్య‌క‌ర్త గంటా స్వ‌రూప‌దేవి ఆధ్వ‌ర్యంలో జ‌న‌సైనికులు క‌దిలారు.. రంప‌చోడ‌వ‌రంలోని మెడిక‌ల్ క్యాంప్‌లో రోగుల్ని ప‌రామ‌ర్శించారు.. అక్క‌డ ప‌రిస్థితులు, సౌక‌ర్యాల లేమి చూసి చ‌లించారు.. క‌నీసం ర‌క్తం కూడా అందుబాటులో లేక‌పోవ‌డాన్ని గ‌మ‌నించారు.. మీకు మేం అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.. పాల‌కులు చేయ‌లేని ప‌నిని మేం చేస్తాం అని భ‌రోసా ఇచ్చి వ‌చ్చారు..

ఇచ్చిన మాట మేర‌కు ర‌క్త‌హీన‌త‌., విష‌జ్వ‌రాల‌తో బాధ ప‌డుతున్న గిరిజ‌నం కోసం ఓ బ్ల‌డ్ డొనేష‌న్ క్యాంప్ నిర్వ‌హించారు.. రాజ‌మండ్రి ప్ర‌భుత్వ ఆర్ట్స్ కాలేజీలో జ‌న‌సైనికురాలు, జ‌న‌సేవ ఫౌండ‌ర్ గంటా స్వ‌రూప దేవి ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిభిరం ఏర్పాటు చేశారు.. జ‌న‌సేవ‌కు., జ‌న‌సేన ఇచ్చిన పిలుపుకి భారీ స్పంద‌న ల‌భించింది.. అడ‌విబిడ్డ‌ల కోసం ర‌క్తం ఇచ్చేందుకు యువ‌త క్యూ క‌ట్టింది.. యువ‌కులే కాదు., యువ‌తులు కూడా ర‌క్త‌దానానికి పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డం విశేషం..

ఇక్క‌డ సేక‌రించిన ర‌క్తాన్ని మ‌న్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిజ‌నాన్ని కాపాడేందుకు వినియోగించ‌నున్నారు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వై.శ్రీను, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్స్‌ప‌ల్ డాక్ట‌ర్ డేవిడ్ కుమార్ స్వామి, ఎల‌క్ట్రిక‌ల్ డీ5 ఏఈ గంటా ప్ర‌సాద్ త‌దిత‌రులు ఈ సేవా కార్య‌క్ర‌మానికి త‌మ‌వంతు చేయూత‌నిచ్చారు.. ఈ ర‌క్త‌దాన శిభిరం ద్వారా సేక‌రించిన ర‌క్తంతో పాటు పౌష్టికాహారం, అవ‌స‌ర‌మైన మందులతో త్వ‌ర‌లో మెడిక‌ల్ క్యాంప్ నిర్వ‌హించ‌నున్నారు..

పాల‌న ఎక్క‌డ విఫ‌ల‌మౌతుందో..? ప‌్ర‌జ‌లు ఎక్క‌డ స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతుంటారో..? అక్క‌డ తానుంటాన‌న్న జ‌న‌సేనుడి స్ఫూర్తితో అడ‌విబిడ్డ‌ల‌కు జ‌న‌సైన్యం చేస్తున్న సేవకు జ‌య‌హో అనాల్సిందే..

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments