జ‌న‌సేన సేవాద‌ళం ల‌క్ష్యాలు ఏంటి..? జ‌న‌సేనుడు నిర్ధేశించిన ల‌క్ష్యాల‌ను రాష్ట్ర వ్యాప్తంగా సేవాద‌ళం అందుకుంటోందా..? జిల్లాల్లో సేన విస్తృతి ఎలా ఉంది..? ఓ జిల్లాని యూనిట్‌గా తీసుకుని చూస్తే.. గ‌డ‌చిన రెండు నెల‌ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సేవాద‌ళ్ కార్య‌క్ర‌మాలు ఊహించిన స్థాయి కంటే సంతృప్తి క‌రంగానే సాగుతున్నాయి.. జిల్లాని యూనిట్‌గా తీసుకుందామ‌న్న ఆలోచ‌నతో ప్ర‌కాశం జిల్లాలో కార్య‌క‌లాపాలు ప‌రిశీలిస్తే.. ఓ జ‌ర్న‌లిస్టు సేవాద‌ళ్ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్నారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమాన సంఘం జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న రావూరి బుజ్జి సేవాద‌ళ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో పాటు., జ‌న‌సేనాని ల‌క్ష్యాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లుప‌రుస్తున్నారు.. ముఖ్యంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం యూనిట్‌గా తీసుకుని., మండ‌ల‌, గ్రామ‌స్థాయి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానులు., జ‌న‌సైనికుల్ని స‌మ‌న్వ‌య ప‌రుస్తూ ముందుకి సాగుతున్నారు.. ముఖ్యంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఐక‌మ‌త్యాన్ని పెంపొందించ‌డంలో బుజ్జి భాగానే స‌క్సెస్ అయ్యార‌ని చెప్పొచ్చు..

ఇప్ప‌టి వ‌ర‌కు గిద్ద‌లూరు, ప‌ర్చూరు నియోజ‌క‌వర్గాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైన బుజ్జి., పార్టీ అధినేత., జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సిద్ధాంతాలు ఏంటి..? వాటిని జ‌నంలోకి తీసుకువెళ్ల‌డం ఎలా అనే అంశాల‌తో పాటు ., స‌మ‌రానికి ప్ర‌తి కార్య‌క‌ర్త‌ని స‌న్న‌ద్దం చేస్తున్నారు.. ముఖ్యంగా సేవామార్గం, పోరాట స్ఫూర్తి రెండింటినీ స‌మ‌న్వ‌య‌ప‌ర్చుకుంటూ ముందుకి ఎలా సాగాల‌నే అంశాల‌ను వివ‌రిస్తున్నారు.. ప్ర‌తి జ‌న‌సైనికుడు స‌మాజానికి సేవ‌కుడిగా, సైనికుడిగా మారి ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ దిశానిర్ధేశం చేస్తున్నారు..

స్థానిక స‌మ‌స్య‌ల్ని ఆయా ప్రాంతాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సేవాద‌ళ్ దృష్టికి తీసుకువ‌చ్చిన‌ప్పుడు., వాటి ప‌రిష్కార మార్గాల్ని సూచించ‌డం., పోరాడాల్సిన ప‌రిస్థితులు ఉంటే., ముందుగా ఏం చేయాలి.. ఆ త‌ర్వాత పార్టీ ఎలాంటి మ‌ద్ద‌తు ఇస్తుంది అనే అంశాల‌ను కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో పంచుకుంటున్నారు.. ముందుగా ఎవ‌రి గ్రామంలో స‌మ‌స్య‌లు వారు గుర్తించాల‌ని., ఆ త‌ర్వాత మండ‌ల స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌ల్ని గుర్తించి ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించాల‌ని సూచిస్తున్నారు..

ప్ర‌కాశం జ‌న‌సేన సేవాద‌ళ్ త‌దుప‌రి షెడ్యూల్ ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్ణ‌యించారు.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సేవాద‌ళ్ స‌మ‌న్వ‌యం పూర్త‌యిన పిద‌ప జిల్లా కేంద్రంలో ఓ స‌మావేశం ఏర్పాటు చేసి., అంద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌యం కుదుర్చాల‌న్న‌ది వారి ల‌క్ష్యం.. ఇక ప‌నిలో భాగంగా., మ‌ధ్య మ‌ధ్య‌న సేవా కార్య‌క్ర‌మాల‌పై కూడా జ‌న‌సేన సేవాద‌ళం స‌భ్యులు ఓ చేయి వేస్తున్నారు.. ప్ర‌జ‌లు కూడా జ‌న‌సేనకు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments