భార‌త దేశ చ‌రిత్ర‌లో తొలిసారి క్రియాశీల‌క రాజ‌కీయాల్లో యువ‌త‌, మేథావుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌నే ఉద్దేశంతో జ‌న‌సేనాని., ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రూప‌క‌ల్ప‌న చేసిన న‌వ‌నాయ‌క‌త్వ ఎంపిక కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముందుకి దూసుకుపోతోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి 15 జిల్లాల‌కి ద‌ర‌ఖాస్తులు కోరుతూ జ‌న‌సేన పార్టీ జారీ చేసిన నోటిఫికేష‌న్‌కి అమోఘ‌మైన స్పంద‌న ల‌భించింది.. జ‌నం మ‌ధ్య ఉన్న జ‌న‌సైనికులు వేలాది మంది ఒక్క‌సారిగా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఎగ‌బ‌డ‌గా., స‌ర్వ‌ర్లు సైతం ప‌నిచేయ‌ని ప‌రిస్థితి త‌లెత్తింది.. అయితే పార్టీ త‌రుపున కొంద‌రు జ‌న‌సైనికులు స్వ‌చ్చందంగా టీంలుగా ఏర్ప‌డి., ద‌ర‌ఖాస్తు దారుల‌కి స‌హాయ స‌హ‌కారాలు అందించారు.. ప్ర‌క‌ట‌న జారీ చేసి ఐదు రోజులు దాటిన నేప‌ధ్యంలో., ఎంపిక శిభిరాలు ఏర్పాటుకి జ‌న‌సేనుడు శంఖం పూరించారు..

15 జిల్లాల‌కి సంబంధించి ఎంపిక ప్ర‌క్రియ‌ను ఈ సారి తెలంగాణ జిల్లాల నుంచి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌(పాత జిల్లాల ప‌రిధి)ల‌లో 24, 25 తేదీల్లో ఎంపిక శిభిరాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. కేవ‌లం ప్ర‌తిభాపాట‌వ ప్ర‌ద‌ర్శ‌న‌కు మాత్ర‌మే ఈ రిక్రూట్‌మెంట్ క్యాంప్‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఇంత‌కు ముందే తెలిపిన జ‌న‌సేనుడు., ప్ర‌జాసేవ చేయాల‌న్న కాంక్ష‌, నిబ‌ద్ద‌త‌తో ఎంత మంది వ‌చ్చినా పార్టీ ఆధ‌రిస్తుంద‌ని చెబుతున్నారు.. ద‌ర‌ఖాస్తు దారులు జ‌న‌సేన వెబ్‌సైట్ ద్వారా ఈ రెండు జిల్లాల‌కి ఆన్‌లైన్ ద్వారా అప్లికేష‌న్లు పంప‌డానికి మ‌రో రెండు రోజులు గ‌డువు ఇచ్చారు.. ఈ నెల 22 రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఔత్సాహికులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు టైం ఇచ్చారు.. మ‌రుస‌టి రోజు శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు క‌రీంన‌గ‌ర్ జిల్లాకి చెందిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.. ఏమైనా ఇబ్బందుల వ‌ల్ల ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోలేక పోయిన వారు ఎంపిక శిభిరాల వ‌ద్ద‌కు నేరుగా వ‌చ్చి పేర్ల‌ను న‌మోదు చేసుకుని., ఎంపిక ప్ర‌క్రియ‌లో పాల్గొన వ‌చ్చ‌ని కూడా జ‌న‌సేనుడు ప్ర‌క‌టించారు.. మిగిలిన వివ‌రాలు పార్టీ ప్ర‌తినిధులు ఈమెయిల్‌, ఎస్ఎంఎస్‌ల ద్వారా అభ్య‌ర్ధుల‌కి తెలియ‌ప‌రుస్తారు.. మ‌రిన్ని వివ‌రాలు జ‌న‌సేన పార్టీ ఫేస్‌బుక్ పేజీలో చూడొచ్చు..

ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఎంపిక ప్ర‌క్రియ‌ను మంచిర్యాల‌లోని ఫారెస్ట్ కాంట్రాక్టు అసోసియేష‌న్ ఫంక్ష‌న్ హాల్లోనూ., క‌రీంన‌గ‌ర్ జిల్లాకి సంబంధించి ఎంపిక శిభిరాన్ని పెద్ద‌ప‌ల్లిలోని వెంక‌టేశ్వ‌రా హాస్పిట‌ల్ స‌మీపంలోని డీసెంట్ ఫంక్ష‌న్ హాల్‌లోనూ నిర్వ‌హించ‌నున్న‌ట్టు కూడా జ‌న‌సేనాని త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. సో రాజ‌కీయాలను ప్ర‌క్షాళ‌న గావించేందుకు జ‌న‌సేనుడు చేస్తున్న ఈ మ‌హాయ‌జ్ఞంలో భాగ‌స్వాములు కాద‌ల‌చిన‌వారు వెంట‌నే ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోండి.. వీలుకాకున్నా నేరుగా ఎంపిక శిభిరానికి రావ‌చ్చు కూడా..

 

Originally Published by PawanToday.com

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments