ప్రతి జనసేన సైనికులకి తెలియజేయండి

You are here Home » ప్రతి జనసేన సైనికులకి తెలియజేయండి

ప్రతి జనసేన సైనికులకి తెలియజేయండి

జనసేన సైనికులకు విజ్ఞప్తి : –
2018 లొనే ఎన్నికలు జరగనున్నాయి, జనసేన సైనికులంతా ఏకమై ఎన్నికల యుద్దానికి సిద్ధమై మన సత్తా చాటాలని ఆకాంక్షిస్తూ, ముందస్తు ఎన్నికలు ఎందుకు వస్తున్నాయో వివరించాలని అనుకుంటున్నాను….
దేశంలోని పలురాష్ట్రాల్లో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ అదే ఊపును కొనసాగించాలనుకుంటోంది. ప్రధాని మోడీ ఏకంగా ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఒకే దేశం- ఒకేసారి ఎన్నికలు నినాదాన్ని వినిపిస్తున్నారు. పదేపదే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో కేంద్రంలోని ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రజలకు ఇబ్బందికలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి తారుమారవుతుందన్న భయం.
ఈ నేపథ్యంలో దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాలతో ఆయన చర్చలు జరిపారు. మొత్తం 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ నిర్ణయానికి మద్దతు తెలిపారు. అలా మద్దతు తెలిపిన వారిలో చంద్రబాబు, కేసీఆర్‌ కూడా ఉన్నారని టీడీపీ అనుకూల పత్రిక కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించనున్నారు.
జమిలి ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలం తాత్కాలికంగా పొడించనున్నారని సమాచారం. దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఐదేళ్లపాటు ప్రభుత్వాలు స్వేచ్చగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఇటీవల విశాఖ కార్పొరేషన్ ఎన్నికలపై చంద్రబాబును ప్రశ్నించగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తామంటూ ఏకకాలంలో ఎన్నికల నినాదాన్ని వినిపించారు. మోడీ నిర్ణయం వల్లే చంద్రబాబు ఇలా మాట్లాడారని భావిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీకి దేశంలో సానుకూల ఫలితాలు వస్తున్నందున ఇప్పుడు దేశం మొత్తం ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే కాంగ్రెస్‌ను పూర్తిస్థాయిలో దెబ్బకొట్టవచ్చని మోడీ భావిస్తున్నారు. 2020లోపు కాలపరిమితి ఉన్న అసెంబ్లీలను రద్దు చేసి 2018లో లోక్‌సభతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారు. 2020వరకు మించి కాలపరిమితి ఉన్న అసెంబ్లీ పదవీ కాలం మరికాస్త పొడిగించి 2018లో వాటిని కూడా కలుపుకుని దేశం మొత్తం ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు మోడీ సర్కార్ ప్రణాళిక రచించింది.
2023నాటికి దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు జరిగేలా చేయాలన్నది బీజేపీ వ్యూహం. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్, చంద్రబాబు అంగీకరించారని అందు వల్లే ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నట్టు చెబుతున్నారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు, రైతులకు ఉచితంగా ఎరువులు వంటి పథకాలను కేసీఆర్ ప్రకటించడానికి కారణం ముందస్తు ఎన్నికల అంశమేనని చెబుతున్నారు.
అయితే ఇటీవల ఏమాత్రం బాధ్యతలేకుండా, రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతూ నిర్ణయాలు తీసుకుంటున్న మన నేతలకు ఎన్నికల భయం లేకుండా ఐదేళ్ల పాటు పాలన అప్పగిస్తే మరింత రెచ్చిపోతారన్న అభిప్రాయం కూడా ఉంది. దేశం మొత్తం మీద లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించినా ఒకవేళ హంగ్ ప్రభుత్వాలు వచ్చి అవి మధ్యలో కూలిపోతే తిరిగి వ్యవహారం మొదటికి వస్తుందన్న నా అభిప్రాయం….. జై జనసేన…..జై పవన్ కళ్యాణ్…..జై హింద్…..మీ…రాజేష్

By | 2017-07-22T17:56:40+00:00 April 23rd, 2017|జనసేన|0 Comments

About the Author:

Admin Author for Pawan Kalyan fans.com.

Leave A Comment