అధికారం లేదు.. ప‌ద‌వులు లేవు.. గుండెల నిండా జ‌న‌సేనుడు నింపిన స్ఫూర్తి మాత్రం ట‌న్నుల కొద్ది ఉంది.. ఆ స్ఫూర్తే ఉద‌యం నిద్ర లేనింది.. తిరిగి మంచం ఎక్కేవ‌ర‌కు ఒక్క‌టే ఎవ‌రు ఏ ఇబ్బందిలో ఉన్నారు.. ఎలాంటి స‌హాయం వారికి అవ‌స‌రం.. అని వెతికి మ‌రీ చేసేస్తున్నారు.. ఎవ‌రికి ఏ స‌మ‌స్య ఉన్నా.,, ఆ స‌మ‌స్య త‌మ‌దే అనుకుంటున్నారు.. బోర్డ‌ర్‌లో సైన్యం శ‌త్రుదేశాల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంటే., జ‌న‌సైన్యం స‌మ‌స్య‌ల నుంచి క‌ష్టాల నుంచి 24 గంట‌లు ప్ర‌జ‌ల‌కి ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంది.. దేశ‌చ‌రిత్ర‌లో ఏ నాయ‌కుడు నింప‌లేని స్ఫూర్తి.. ఏ పార్టీ కార్య‌క‌ర్త‌లు చేయ‌లేని., చేయ‌ని సేవ ఇది.. స్కూల్‌కి వెళ్లే చిన్నారుల ద‌గ్గ‌ర నుంచి మూడు కాళ్ల ముస‌లి వ‌ర‌కు ఈ సేవ‌ను అందుకునేందుకు అంద‌రూ అర్హులే.. జ‌న‌సైన్యం సేవ., స‌మాజంలో చేయ‌గ‌లిగిన స్థోమ‌త‌, ఓపిక ఉన్న అంద‌రిలో స్ఫూర్తిని నింపాల‌న్న ల‌క్ష్యంతో.. ప్ర‌తి ప‌నినీ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నాం..

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారు., వైద్యం చేయించుకునే స్థోమ‌త‌లేని వారు ఎవ‌రు తార‌స‌ప‌డినా., తాము సాయం చేయ‌డ‌మే కాదు.. న‌లుగురితో చేయించ‌డం కూడా చేస్తూ ఆర్తుల‌ని ఆదుకుంటోంది జ‌న‌సైన్యం.. రాజ‌ధాని జిల్లా గుంటూరులో సేవాద‌ళ్ స‌భ్యులు లండ‌న్ స‌తీష్‌, అమ్మిశెట్టి వాసు, జ‌న‌సైనికురాలు ర‌మాదేవి., మ‌రికొంద‌రు కార్య‌క‌ర్త‌లు సంయుక్తంగా మంచాన ప‌డిన ఓ అభాగ్యుడికి త‌మ‌వంతు సాయం అందించారు..

గుడివాడ‌లో ర‌క్త‌దానం అనే ప‌దానికి కేరాప్ అడ్ర‌స్‌గా మారిన జ‌న‌సైనికుడు రామ‌కృష్ణ‌., ప్ర‌భుత్వాసుప‌త్రిలో ఓ గ‌ర్భిణి ప్ర‌మాదంలో ఉంద‌ని తెలుసుకుని త‌న స‌హాయ‌కుల‌తో హుటాహుటిన అక్క‌డికి వెళ్లారు.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు మీద రెండు యూనిట్ల ర‌క్తాన్ని అందించారు.. రామ‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఇలా ర‌క్త‌దానం చేయ‌డం ఇది 109వ సారి కావ‌డం గ‌మ‌నార్హం..

ఇక జ‌న‌సేనుడి స్ఫూర్తి కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం కాలేదు.. ఖండాంత‌రాలు దాటి మ‌రీ ప్ర‌వ‌హిస్తోంది.. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో టీం జ‌న‌సేన కువైట్ విభాగం అభాగ్యుల‌ని ఆదుకున్న తీరే అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం.. సంపాద‌న కోసం దేశాలు దాటి వెళ్లిన ప‌వ‌న్ అభిమానులు సంపాదించిన మొత్తంలో కొంత‌భాగాన్ని., జ‌న‌సేనుడి స్ఫూర్తితో స్వ‌దేశంలో ఉన్న అన్నార్తుల ఆదుకునేందుకు ఖ‌ర్చు చేస్తున్నారు.. స‌త్య‌మేవ జ‌య‌తే ఫౌండేష‌న్ పేరుతో గ‌డ‌చిన 18 నెల‌ల కాలంలో 11 ల‌క్ష‌ల 80 వేల రూపాయిలు పేద‌ల సేవ‌కు వినియోగించారు..

కేజీ టూ పీజీ.. విద్య‌.. ప్ర‌తి విద్యార్ధి హ‌క్కు.. ఇది జ‌న‌సేన నినాదం.. ఈ విద్య కార్పొరేట్ క‌బంధాల్లో ప‌డి., సామాన్యుడికి అంద‌ని ద్రాక్ష‌గా మారుతున్న త‌రుణంలో స‌ర్కారీ స్కూళ్ల‌లో చ‌దువుకునే విద్యార్ధుల‌ని ప్రోత్స‌హించే ఉద్దేశంతో జ‌న‌సైన్యం రంగంలోకి దిగింది.. స‌ర్కారీ స్కూళ్ల‌లో విద్యార్ధుల‌కి పుస్త‌కాలు, సామాగ్రి పంపిణీ చేస్తోంది.. తాజాగా న‌ర‌స‌రావుపేట‌లో రెండు ప్ర‌భత్వ పాఠ‌శాలల్లో జ‌న‌సైనికులు పుస్త‌కాలు పంచారు.. చ‌దువు కోవ‌డం పిల్ల‌ల హ‌క్కు.. కార్పొరేట్ క‌ల్చ‌ర్‌తో దాన్ని కాల‌రాయోద్దు అనే నినాదంతో న‌ర‌స‌రావుపేట‌లో భ‌మ‌రాంబ ప‌బ్లిక్ స్కూల్‌, ఠాగూర్ మునిస్ప‌ల్ స్కూళ్ల‌లో పుస్త‌కాలు, ప‌రిక‌రాల పంపిణీ..

ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ మీ ముందు ఉంచ‌డం వెనుక ఉద్దేశం.. ప్ర‌చారార్భాటం కాదు.. ప‌దిమందికి స్ఫూర్తిని పంచ‌డ‌మే.. జ‌య‌హో.

 

Originally Published by Pawantoday.com

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments