త‌లా..తోకా.. రెండూ ఉంటే వాటిని ఏమంటారో అంద‌రికీ తెలుసు.. అందుకే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆయ‌న సైన్యం., కేవ‌లం త‌ల‌ను మాత్ర‌మే వాడ‌తారు.. ఎందుకంటే వారికి తోక‌ల‌తో చేసే చేష్ట‌లు రావు గ‌నుక‌.. ముందుగా తోక‌లు మాత్ర‌మే ఉన్న మీరంతా., అదే రోజా గారూ అండ్ కో దీన్ని గ‌మ‌నించాలి.. మీ తోక‌లు కేవ‌లం జ‌నాన్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మాత్ర‌మే ప‌ని చేస్తాయి.. జ‌న‌సేన త‌ల‌లు నిత్యం ప్ర‌జాప్ర‌యోజ‌నం అన్న కాన్సెప్ట్‌తో మాత్ర‌మే ప‌నిచేస్తాయి.. మీ ప‌నికి మీకు భాగానే ముడ‌తాయి.. జ‌న‌సేనుడు., ఆయ‌న సైన్యం చేసే ప‌నికి వారి జేబుల్లో ఉన్న కాస్త చ‌మురు కూడా వ‌దులుతుంది.. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న తేడా ఏంటో జ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటారు.. తోక‌లు చేసే చేష్ట‌లు కొంత వ‌ర‌కు మాత్ర‌మే జ‌నం భ‌రాయించ గ‌లుగుతారు.., ఆవి కాస్త శృతి మించితే., ఊరి అవ‌త‌లికి., అదే మీకు న‌చ్చిన ప్రాంతానికి త‌రిమి..త‌రిమి కొడ‌తారు..

రోజమ్మా., ఇంత‌కీ మీ పార్టీ గురించి గానీ., మీ పార్టీ నేత‌ల గురించి గానీ., ఏనాడైనా జ‌న‌సేనుడు గానీ., జ‌న‌సైన్యం గానీ మాట్లాడారా..? నిత్యం మీ పార్టీ నేత‌లు ., మీరు., మీ ఆస్తాన ప‌త్రిక‌లు ఎందుకు అలా ఉలిక్కి ప‌డుతున్నాయి..? ఓ మీకు జ‌న‌సేన ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌త్య‌ర్ధిగా క‌న‌బ‌డుతోందా..? అందుకే చీప్‌గా., విలువా., స‌లువా లేని కామెంట్లు చేస్తున్నారా..? అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు చేస్తున్నారా..? రోజ‌మ్మా.. జ‌ప‌సైన్యం నిన్ను ప్ర‌శ్నిస్తోంది.. మా పార్టీ త‌లా తోక‌ల అవ‌స‌రం మీకేముంది.. ముందు ప‌విత్ర‌మైన చ‌ట్ట‌స‌భ‌ను., మీ తోక‌ల‌తో., మీరు వేసిన కుప్పిగంతులతో అప‌హాస్యం చేశారు.. ముందు మీరు ఆ వీడియోలు ఒక‌సారి తిల‌కించి., మ‌హిళ‌ల్లో మ‌ణిన‌ని చెప్పుకునే మీరు., ఓ భార‌తీయ మ‌హిళ అలా చేయోచ్చా అన్న‌ది ముందుగా మీ అంత‌రాత్మ‌ని ప్ర‌శ్నించుకోండి.. నిత్యం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., జ‌న‌సేన గురించి ఏదో ఒక‌టి మాట్లాడి వార్త‌ల్లో ఉంటే చాలు అనుకుంటే., ఈ వార్త‌లే రేప‌టి మీ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకి శాపాలుగా ప‌రిణ‌మిస్తాయి.. క‌బ‌డ్దార్‌.. ఇది జ‌న‌సైన్యం.. ప్ర‌జా సైన్యం హెచ్చ‌రిక‌..

ఇంత‌కీ అమ్మా.. రోజ‌మ్మా.. మీలాంటి వారిని ఆహ్వానించేందుకు జ‌న‌సేన పార్టీ సిద్ధంగా లేదు.. జ‌న‌సేనుడు అంత‌కంటే సిద్ధంగా లేరు.. మీ లాంటి వారికి జ‌న‌సైన‌లో చోటు లేదు.. మీలాంటి వారిని చూసే., రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌ణ చేయాల‌నే ఉద్దేశంతో., జ‌న‌సేనుడు న‌వ‌నాయ‌క‌త్వం కోసం అన్వేష‌న మొద‌లుపెట్టారు.. ఓ మీ పార్టీ అధినేత ఎన్నిక‌ల వ్యాహం కోసం కోట్లిచ్చి పెట్టుకున్న ప్ర‌శాంత్ కిషోర్‌ మిమ్మ‌ల్ని పార్టీ నుంచి సాగ‌నంపితేగాని., పార్టీ భాగుప‌డ‌ద‌ని చెప్పారంట‌గా..? వైసీపీ గెంటేస్తే., ఎక్క‌డ చోటు దొరుకుతుందా.. అని వెతుక్కునే క్ర‌మంలో., మీ స్థాయి పొలిటిక‌ల్ గేమ్ ప్లే చేస్తున్నారా..? ఇలాంటి వాటిని జ‌న‌సేన అస్స‌లు ప‌ట్టించుకోదు.. కానీ బ‌దులు మాత్రం గ‌ట్టిగానే ఇస్తుంది.. అర్ధమైంద‌నుకుంటా.. అయితే ఓకే..

 

originally published on PawanToday.com

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments