జ‌న‌సైన్యం ఇఫ్త‌ర్ సంద‌డి.. ప‌విత్ర‌మాసంలో పేద ముస్లిం సోద‌రుల క‌డుపునింప‌డ‌మే ల‌క్ష్యం..

You are here Home » జ‌న‌సైన్యం ఇఫ్త‌ర్ సంద‌డి.. ప‌విత్ర‌మాసంలో పేద ముస్లిం సోద‌రుల క‌డుపునింప‌డ‌మే ల‌క్ష్యం..

జ‌న‌సైన్యం ఇఫ్త‌ర్ సంద‌డి.. ప‌విత్ర‌మాసంలో పేద ముస్లిం సోద‌రుల క‌డుపునింప‌డ‌మే ల‌క్ష్యం..

ప‌విత్ర రంజాన్ మాసం.. ముస్లిం సోద‌రుల‌కి అతిప‌విత్ర‌మైన మాసం.. ఈ మాసంలో ఒక్క పేద ముస్లిం సోద‌రుడి క‌డుపు నింపినా బోలెడంత పుణ్యం ద‌క్కుతుందంట‌.. రోజంతా క‌ఠిక ఉప‌వాసం ఉండే వీరి ఆక‌లి తీర్చ‌డం నిజంగా మ‌హ‌ద్భాగ్య‌మే.. త‌ల్లి క‌డుపు చూస్తుందన్న సామెత‌కు విలువ‌నిస్తూ., జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చూపు ఎప్పుడూ ఆక‌లిగొన్న క‌డుపుల వైపే ఉంటుంది.. ధ్యాస వారి ఆక‌లి తీర్చ‌డం పైనే ఉంటుంది.. ఆయ‌న స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న జ‌న‌సైనికులు ప‌విత్ర మాసంలో పేద ముస్లిం సోద‌రుల క‌డుపు నింపే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు.. సేవాగుణంలో జ‌న‌సేనుడికి ఏ మాత్రం తీసిపోమంటున్న ఆయ‌న సైన్యం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఇఫ్త‌ర్ విందుల బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు..

ఎలాంటి అంశాన్నైయినా జ‌న సేవ‌కు వినియోగించాల‌నే ల‌క్ష్యంతో ముందుకి వెళ్తున్న సైనికులు., కుల‌,మ‌తాల‌కి అతీతంగా ప్ర‌తి పండుగ‌ను చేస్తూ స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వాన్ని చాటుతున్నారు.. ఇప్పుడు మురికివాడ‌ల్లో నివ‌సించే పేద ముస్లిం సోద‌రుల ఆక‌లి తీర్చే ప‌నిని చేప‌ట్టారు.. జ‌న‌సేన సేవాద‌ళ్ కూడా త‌న‌వంతు బాధ్య‌త‌ల్ని తీసుకుంది.. కృష్ణాజిల్లా గుడివాడ‌లో ప‌విత్ర‌మాసంతో పాటు శుక్రవారం ప‌విత్ర‌దినం కూడా కావ‌డంతో., తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వంద‌లాది మంది ముస్లిం సోద‌రుల‌కు జ‌న‌సేవ‌కులు ఆకలితీర్చారు.. అదీ ఎవ‌రి స‌హాయం తీసుకోకుండా..


పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు, జ‌న‌సేన సేవాద‌ళ్ స‌భ్యులు ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను త‌మ భుజాల‌పై వేసుకుని న‌డిపిస్తున్నారు.. శుక్రువారం ప‌విత్ర‌దినోత్స‌వం కూడా కావ‌డంతో గుడివాడ జ‌న‌సైనికుడు బూర‌గ‌డ్డ శ్రీకాంత్ స్థానిక మస్జీద్‌లో ఇఫ్త‌ర్ ఇచ్చారు.. దీంతో పాటు పేద‌లు ఉండే వీదుల్లోకి వెళ్లిమ‌రీ సుమారు రెండు వార్డుల‌కి చెందిన 5 వంద‌ల మందికి విందు ఇచ్చారు.. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సైనికులు మండ‌లి రాజేష్‌, అడ‌పా వినీత్‌ల‌తో పాటు అమ్మిశెట్టి వాసులు పాల్గొన్నారు..


తూర్పుగోదావ‌రి జిల్లా క‌డియ‌పు లంక‌లో., రాజ‌ధాని న‌డిబొడ్డు బెజ‌వాడ‌లో.., ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఎవ‌రి ఓపిక్కి త‌గ్గ‌ట్టు వారు ఇఫ్త‌ర్‌లు ఏర్పాటు చేసేస్తున్నారు.. మా ప్ర‌భుత్వం, మా పాల‌కుడు జ‌న‌సేనుడేన‌ని., జ‌న‌సేనుడి పాల‌నవ‌స్తే., ఒక్క రంజాన్ మాసంలోనే., నేడి ప్ర‌భుత్వాలు ఇస్తున్న‌ట్టు పండుగ రోజులు స‌రుకులు ఇచ్చి స‌రిపెట్ట‌డ‌మో మాల‌క్ష్యం కాద‌ని., స‌మ‌స్య‌లు తీరి జ‌నం నిత్యం పండుగ చేసుకునే రోజులు వ‌స్తాయ‌ని ప్ర‌తి ఒక్క‌రికీ భ‌రోసా ఇస్తున్నారు.. జ‌నం కూడా అన్న‌దాతా సుఖీభ‌వ అనే అశీర్వాదంతో పాటు జ‌న‌సేన‌కు జ‌యం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నారు..

originally Published in pawantoday.com

By | 2017-07-22T17:56:09+00:00 June 17th, 2017|Uncategorized|0 Comments

About the Author:

Admin Author for Pawan Kalyan fans.com.

Leave A Comment