మా వాడు ఒకడన్నాడు.. “స్టూడెంట్స్ కి పాలిటిక్స్ ఎందుకురా..? మన చదువులేవో మనం చదువుకుంటే చాలదా? ఐనా పాలిటిక్స్ లో మనం ఏమన్నా చేద్దామన్నా చెయ్యనివ్వరు..!” ఈ వాదన సమంజసమేనా..?
కాదు అనే చెప్తాను..! ఇక్కడ ముందు అర్ధం చేస్కోవాల్సింది ఏంటంటే.. అసలు పాలిటిక్స్ అంటే ఏమిటి? దురదృష్టవశాత్తూ “పాలిటిక్స్ చేయడం” అనగానే నెగటివ్ సెన్స్ వస్తుంది, కానీ లెట్స్ టేక్ ద పాసిటివ్ మీనింగ్…
పాలిటిక్స్ అంటే “పబ్లిక్ అఫైర్స్ లో ఏక్టివ్ పార్ట్ తీస్కొవడం”.. “సమాజ ప్రయోజనాల కోసం క్రియాశీలకంగా వ్యవహరించడాన్నే రాజకీయం” అని నేనంటాను.. ఏదో ఎలక్షన్లలో నిలబడి అసెంబ్లీకి పోయిరావడమే రాజకీయం కాదు. నీ వీధి మొగలో ఉన్న పనిచేయని స్ట్రీట్ లైట్ ని కంప్లైంట్ ఇచ్చి బాగుచేయించుకున్నా అది రాజకీయమే!
ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే.. మా ఇంటి దగ్గర రోడ్డు వేస్తామని 2003లో కాంగ్రెస్ గవర్నమెంటు గెలిచినపుడు శంకుస్థాపన చేసెళ్ళారు. ఏడేళ్ళు గడుస్తున్నా ఏ మార్పూ లేదు. ఆ శంకుస్థాపన రాయి కూదా శిథిలావస్థకి చేరుకుంది. ఆ రోడ్డు ఎందుకు వేయట్లేదు? ఒకవేళ దానికి నిధులు కేటాయించి ఉంటే అవి ఏమైనాయి? అని ఆ మున్సిపల్ కమీషనర్ ని ప్రశ్నించి.. అవసరమైతే నిలదీసి.. మనకి రావాల్సిన రోడ్డుని మనం సాధించుకోవడం కూడా రాజకీయమే..! అయితే.. ఇది చాలా చిన్న విషయం. రాజకీయం పరిధి చాలా ఎక్కువ. దేశాన్ని నడిపించేదీ, దేశభవిష్యత్తుని నిర్ణయించేదీ రాజకీయమే. అలాంటి రాజకీయంలో యువతరం పాత్ర ఎంతైనా ఉంది.
మరి అలాంటి యువతరం, అదే మన “యూత్”, ఏం చేస్తోంది?- సమయాన్ని వృధా చేస్తోంది! నిజం చెప్పాలంటే అదే చేస్తోంది.మన యువతకి మన దేశం మీదే అనాసక్తి, అయిష్టత, మరికొందరికైతే ఏకంగా ద్వేషంగా కూడా ఉంది. ఎందుకు.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? మా ఫ్రెండు ఈ విధంగా మాట్లాడాడు అని నాకు కొత్తగా కలిగిన బాధ ఏమీ లేదు ఎందుకంటే ప్రాధమిక విద్య స్థాయి నుంచీ పిల్లవాడు వృత్తివిద్య పూర్తి చేసేదాకా రెసిడెన్షియల్ పద్దతిలో హాస్టళ్ళలో నాలుగ్గోడలమధ్య పెంచుతున్నారు. ఇక వాడికి సమాజం పట్ల, రాజకీయం పట్ల కనీస అవగాహన సైతం ఎక్కడినుంచి వస్తుందీ? ఎవరు నేర్పిస్తారు? చూస్తూనే ఉన్నాం కదా.
సమాజం పట్ల, సమాజంలోని సమస్యల పట్ల అవగాహనారాహిత్యంవల్ల వ్యక్తి సమాచార సామ్రాజ్యవాదానికి సులభంగా లోబడతాడు. అసలు సమస్యలని పక్కనపెట్టి పనికిమాలిన విషయాల కోసం ఆవేశపడుతూ ఊగిపోతూ ఉంటాడు. నిజమైన సమస్యలేంటో గుర్తించలేనివాడు మార్పుకోరని వర్గంలో మిగిలిపోతాడు. ప్రస్థుత రాజకీయాలను సమర్ధిస్తూనో లేక రాజకీయలని avoid చేస్తూనో మార్పుకి ప్రతిబంధకంగా నిలుస్తాడు. ఖర్మ కొద్దీ ఇది చాలామంది తెలియకుండానే చేస్తూ ఉంటారు.
యువత మార్పుయొక్క ఆవశ్యకతని గుర్తించాలి.. తల్లిదండ్రులూ, గురువులూ, మేధావులు, వారిని ఆ వైపుకి ప్రోత్సహించాలి. ఎందుకంటే ” ప్రజల కష్టాల్నీ, కన్నీళ్ళనీ చూసి ఉద్రేకంతో, ఉత్సాహంతో సేవకోసమై, మార్పుకోసమై యువతరం ఉరకలేసిననాడు దేశం ప్రగతిమార్గంలో పరుగులెత్తుతుంది.”……మీ….రాజేష్

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments