ఆగస్టు 7 నెల్లూరులో గల అనురాగ్ హోటల్ నందు తెలుగు తెలుగు రాష్ట్రంలో గల వివిధ జిల్లాలోని పవన్  కళ్యాణ్ అభిమాన సంఘ ముఖ్య నాయకులతో రాష్ట్ర స్థాయి  ఆత్మీయ సమావేశం జరిగింది,ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నాయకులు ట్రంక్ రోడ్డున ఉన్న గాoధీ విగ్రహమునకు పూలమాలలు సమర్పించిన తరువాత వీ,ఆర్.సీ సెంటర్ వద్దగల అంభేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీగా బయలుదేరి విగ్రహమునకు పూలమాలలు సమర్పించి అనురాగ్ ఫంక్షన్ హాలులో సమావేశం అయ్యారు,ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడైన పీ.టోనీ బాబు అధ్యక్షత వహించారు.తరువాత రెండు తెలుగు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన పవన్ అభిమాన సంఘం నేతలు ప్రసంగించారు ప్రతి ఒక్కరూ కూడా అభిమానులు అందరూ ఎవరికి వారు యమునా తీరున ఉండకూడదు మనం అందరూ ఐక్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటిగా ఉండాలని ఆకాంక్షను వ్యక్తపరిచారు,ఈ సంధర్భంగా టోనీ బాబు గారు మాట్లాడుతూ మనం అందరూ కలసి మెలసి ఉండాలంటే రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కలసి పనిచేయటం కొరకై ఒక సంస్థ అవసరం ఎంతైనా ఉందని కావున ప్రతి ఒక్క జిల్లాలోని పవన్ కళ్యాణ్ అభిమానులను సంప్రధిoచి రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం(ఆంద్రప్రదేశ్-తెలంగాణ)ప్రారంభింప చేస్తున్నామని ఆగస్టు 7 న రాష్ట్ర పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవం గా ప్రకటించారు,ఆతరువాత గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు బండిరెడ్డి చందు మాట్లాడుతూ మనం విజయం సాధించాలంటే నిర్ణయం సమిష్టిగా తీసుకోవాలి
పని వ్యక్తిగతంగా చేయాలని తెలియజేస్తూ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం(ఆంద్రప్రదేశ్-తెలంగాణ) ఏర్పాటుచేసిన టోనీ బాబుకి దన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమం లో నెల్లూరు నగర పవన్ అభిమాన సంఘ అధ్యక్షుడు మురళి, చిత్తూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి సురేష్,తూ గో జి నుండి jc వాసు,శ్రీకాకుళం నుండి రామ్మోహన్,కడపనుండి సతీష్ రాయల్,అనంతపురం నుండి గౌతమ్,బాపట్ల నుండి శ్రీ లక్ష్మి,గూడూరు నుండి జాన్సన్,పసుపులేటి శ్రీరాం,విజయవాడ నుండి అశోక్,ఒంగోలు నుండి బుజ్జీ,కర్నూలు నుండి గురునాద్ ఇంకా అనేక జిల్లాల నుండి అభిమాన సంఘ నాయకులు పాల్గొన్నారు

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments